భాజపా, తెరాసలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. బండి సంజయ్ సంతకం ఫోర్జరీ అయితే ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. హైదరాబాద్కు కేంద్రం ఏం చేస్తుందో చెప్పడం లేదని ధ్వజమెత్తారు.
భాజపా, తెరాస నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: పొన్నాల - గ్రేటర్ ఎన్నికలు
గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భాజపా, తెరాసలు మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించాలని ఎంఐఎం వ్యాఖ్యలు చేసిందన్నారు.
భాజపా, తెరాస నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : పొన్నాల
పునర్విభజన చట్టంలోని అంశాలను ఒక్కటైనా భాజపా నెరవేర్చిందా అని నిలదీశారు. ఓట్ల కోసమే పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించాలంటూ ఎంఐఎం వ్యాఖ్యలు చేసిందని విమర్శించారు. అక్రమ కట్టడాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలకు పొన్నాల విజ్ఞప్తి చేశారు.