Congress Left Parties Alliance Telangana వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు చిక్కు.. సీట్ల విషయంలో తేలని లెక్క Congress Left Parties Alliance Telangana : మునుగోడు ఉపఎన్నికల్లో మద్దతుతోనే కాకుండా భవిష్యత్తులోనూ తాము కలిసి సాగుతామని ప్రకటించిన బీఆర్ఎస్, వామపక్షాల బంధం ఎంతోకాలం నిలువలేదు. ఇటీవల అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటనతో కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కామ్రేడ్లు.. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పటికే వామపక్షాలు, కాంగ్రెస్‌తో కలిసి ఉన్నందున.. రాష్ట్రంలోనూ అదే పార్టీతో జతకడితే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని వామపక్ష నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు సీపీఐ నేతలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేతో చర్చలు జరిపారు.
CPI CPM Alliance with Congress in Telangana : పొత్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోయినా.. రెండ్రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీపీఐ జాతీయ నేత నారాయణ(CPI National Leader Narayana) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్, వంశీచంద్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు కాంగ్రెస్ నేతలతో నారాయణ చర్చలు జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చర్చల విషయం అటుంచితే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి సాగుతున్నందున రాష్ట్రంలోనూ అదే పార్టీతో జతకట్టాలనుకుంటున్నట్లు నారాయణ తెలిపారు.
Congress and CPM Alliance in Telangana : కాంగ్రెస్, సీపీఎం పొత్తు.. సీట్ల విషయంలో స్పష్టత వస్తేనే భేటీ
CPI Narayana on Governor System : 'రాష్ట్రాల పాలనలో గవర్నర్ల జోక్యం పెరిగిపోతోంది'
Left Parties Alliance With Congress Telangana : బీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్న సీపీఐ.. 3 సీట్లిస్తే కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సమావేశమైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం.. పొత్తులో భాగంగా కొత్తగూడెం, మునుగోడులతో పాటు బెల్లంపల్లి, హుస్నాబాద్‌లో ఏదో ఒక స్థానాన్ని అడగాలని నిర్ణయించింది. మునుగోడు ఇచ్చేందుకు హస్తం నేతలు(Congress Leaders) సుముఖత వ్యక్తం చేయగా.. ఖమ్మం జిల్లాలో తమకు బలమైన అభ్యర్థులున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముందు కొన్ని డిమాండ్లు ఉంచామని, వాటిని అంగీకరిస్తేనే పొత్తు ఉంటుందని లేదంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీచేస్తాయని సీపీఐ చెబుతోంది.
సీపీఐతో పొత్తు అంశంపై చర్చలు కొనసాగుతుండగా.. అటు సీపీఎంతోనూ కాంగ్రెస్ చర్చించాల్సి ఉంది. కమ్యూనిస్టులు కీలకమైన స్థానాలు అడుగుతున్న పరిస్థితుల్లో వాటి కేటాయింపుపై హస్తం నేతల్లోనూ సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో టికెట్లపోటీ ఇప్పటికే తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారు ఏ విధంగా స్పందిస్తారనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
సీపీఐ, సీపీఎం నేతల ఉమ్మడి సమావేశం.. దాని కోసమేనంట..!
CPI and CPM on Alliance with BRS : 'కలిస్తే సరి.. కలవకపోతే మరో దారి'