కీసర మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి లోని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ తెరాస ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెరాసలో చేరిన హస్తం నాయకులు - మల్కాజిగిరి జిల్లా తాజా వార్తలు
తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు తెరాస గూటికి చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ... మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ తెరాస ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెరాస కండువా కప్పుకున్నారు.
![మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెరాసలో చేరిన హస్తం నాయకులు Congress leaders who joined TRS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7621321-thumbnail-3x2-malla-rk.jpg)
మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెరాసలో చేరిన హాస్తం నాయకులు
తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు తెరాసలో చేరుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్, రైతు బంధు తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.