కీలక విషయాలపై తమను మాట్లాడనివ్వడం లేదంటూ శాసనసభలో కాంగ్రెస్ నిరసనకు దిగింది. ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చే బిల్లులకు మద్దతిస్తున్నా... ఇతర అంశాలపై మాట్లేడే అవకాశం ఇవ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. స్పీకర్ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు.
సభలో మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ వాకౌట్ - clp leader bhatti vikramarka
అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. సభలో పలు అంశాలపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
కాంగ్రెస్ వాకౌట్