రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా హైదరాబాద్ అడిక్మెట్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ నాయకులు నాయకులు వినూత్న పద్ధతిలో నిరసన చేపట్టారు. స్టీలు పళ్లెంపై గరిటతో కొడుతూ... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్.అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
Congress protest: స్టీలు ప్లేటుపై గరిటతో చప్పుడు చేస్తూ నిరసన - musheerabad congress leaders protest
హైదరాబాద్ అడిక్మెట్లోని ఓ పెట్రోల్ బంకు ఎదుట కాంగ్రెస్ నాయకులు వినూత్న పద్ధతిలో నిరసన చేపట్టారు. స్టీలు ప్లేటుపై గరిటతో చప్పుడు చేస్తూ.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
స్టీలు ప్లేటుపై గరిటతో చప్పుడు చేస్తూ... నిరసన
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కేవలం నెలరోజుల్లోనే 12 సార్లు ఇంధన ధరలు పెరగడంపై ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. లాక్డౌన్ నిబంధనలకు అగుణంగానే కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి