దివంగత, పీసీసీ మాజీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతిని కుంటుంబ సభ్యులు హైదరాబాద్‌లో నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎంఏ మైదానంలో జనార్ధన్ రెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామ్‌చందర్ రెడ్డి హాజరయ్యారు. పీజేఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బడుగు, బలహీన, కార్మిక వర్గాల మార్గదర్శకులు పి.జనార్దన్‌రెడ్డి అని వి.హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ నగరానికి మంచి నీటి కోసం పోరాటం చేశారని... ఆ ఫలితంగానే నగరానికి మంచి నీరు వచ్చిందని వీహెచ్ గుర్తు చేసుకున్నారు. పార్టీకి పీజేఆర్ అందించిన సేవలు మరువలేనివన్నారు.