తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Leaders Respond on Pravallika Suicide : 'నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే.. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారు'

Congress Leaders Respond on Pravallika Suicide : ప్రవల్లిక ఆత్మహత్యపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రేవంత్​రెడ్డి ఆక్షేపించారు.

Congress leaders Respond on Pravallika suicide
Pravallika suicide

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 3:43 PM IST

Congress Leaders Respond on Pravallika Suicide : గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడడంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక (Pravallika Suicide ) మరణంపై.. కాంగ్రెస్ నేతలు స్పందించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతకాని ఈ పాలకులను తరిమి కొట్టాలని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు.

Revanth Reddy Respond on Pravallika Suicide : ఇవాళ జరగబోయే రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోను విజయవంతం చేసి.. ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని రేవంత్​రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్న ఈ పాలకులకు బుద్ధి చెప్పి.. రాబోయే ఎన్నికల్లో గద్దె దింపాలని సూచించారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత బతుకమ్మపై చేసిన ట్వీట్‌పై.. రేవంత్​ కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. బతుకమ్మ సంబురాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు.. గ్రూపు పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినపడటం లేదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల హక్కులు కవిత దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప.. మానవీయ ఎజెండాలు కావని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

Six People Suicides in One Day in Hyderabad : హైదరాబాద్‌లో ఆత్మహత్యల అలజడి.. రెండు ఫ్యామిలీలు.. ఆరుగురి బలవన్మరణాలు

KomatiReddy VenkatReddy Reacts Pravallika Suicide : ప్రవల్లిక ఆత్మహత్యపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (KomatiReddy VenkatReddy) తీవ్రంగా స్పందించారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని త్వరలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని.. కావల్సినన్ని ఉద్యోగాలు ఇచ్చుకుందామని పేర్కొన్నారు. నిరుద్యోగులకు చేతిలెత్తి మొక్కుతున్నట్లు.. బతికి సాధిద్దామని తల్లిదండ్రులకు కడుపుశోకం మిగల్చొద్దని సూచించారు. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు.

Telangana Group2 Candidate Committed Suicide : స్వగ్రామానికి ప్రవల్లిక మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు

ప్రవల్లిక ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితెలిపారు. 4 కోట్ల ప్రజలు ఆమె ఆత్మహత్యను ఖండించాలన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని.. ప్రభుత్వం రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చనిపోతుంటే రాష్ట్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు.

Renuka Chowdary Respond on Pravallika Suicide : నిరుద్యోగి ప్రవల్లిక నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తన పార్టీ పేరు, జాతకం, గోత్రం అన్ని మార్చుకున్నారని విమర్శించారు. తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలని చదివిస్తున్నారన్నారు. కేటీఆర్ ఐటీ కింగ్ అంటారని.. పేపర్ల లీకేజీకి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని రేణుక చౌదరి మండిపడ్డారు.

టీఎస్​పీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని రేణుకా చౌదరి (Renuka Chowdhury) డిమాండ్‌ చేశారు. ప్రజారక్షకులుగా ఉండాల్సిన పోలీసులకు మనసులేదా అని ప్రశ్నించారు. విద్యార్థులను కొడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే టీఎస్​పీఎస్సీపై విచారణ జరిపిస్తామని రేణుకా చౌదరి పేర్కొన్నారు.

Rahul Gandi Tweet on Pravalika Suicide : ప్రవల్లిక మృతిపై రాహుల్ గాంధీ ట్వీట్‌.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలన్న గవర్నర్ తమిళిసై

Khammam Unemployed Suicide : 'ఇగ నోటిఫికేషన్లు రావు.. పిచ్చి లేస్తోంది'

ABOUT THE AUTHOR

...view details