పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో వైఫల్యాన్ని నిరసిస్తూ... గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు చేపట్టిన రైతు సంక్షేమ దీక్ష ప్రారంభమైంది. గాంధీభవన్‌తోపాటు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతల దీక్షలకు దిగారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రైస్ మిల్లర్ల తరుగు- తాలు పేరిట 6 నుంచి 8 కిలోల తగ్గించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు వెంటనే డబ్బులు చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని పేర్కొంది. పేదలు, కూలీలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించింది. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్‌పై స్పందించలేదని తెలిపింది.
కాంగ్రెస్ నేతల 'రైతు సంక్షేమ దీక్ష' ప్రారంభం - tpcc updates
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు చేపట్టిన రైతు సంక్షేమ దీక్ష ప్రారంభమైంది. గాంధీభవన్‌తో పాటు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతల దీక్షలకు దిగారు.

కాంగ్రెస్ నేతల 'రైతు సంక్షేమ దీక్ష' ప్రారంభం
Last Updated : May 5, 2020, 12:05 PM IST