తెలంగాణ

telangana

ETV Bharat / state

సభలో.. మాకూ మాట్లాడే అవకాశమివ్వండి: కాంగ్రెస్ నేతలు - ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

హైదరాబాద్ గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అసెంబ్లీ వరకూ ర్యాలీగా వెళ్లారు.

Congress leaders raised concerns at the Hyderabad Gunpark
సభలో.. మాకూ మాట్లాడే అవకాశమివ్వండి: కాంగ్రెస్ నేతలు

By

Published : Mar 23, 2021, 12:33 PM IST

ప్రభుత్వానికి.. ప్రజా సమస్యలు వినే ఓపిక లేదంటూ కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. సభల్లో ప్రభుత్వ తీరుకి నిరసనగా.. నేతలు హైదరాబాద్ గన్‌పార్కు వద్ద ఆందోళన చేపట్టారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. అసెంబ్లీ వరకూ ర్యాలీగా వెళ్లారు.

గన్‌పార్కు వద్ద నేతల ఆందోళన

ప్రభుత్వం.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు యత్నిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. సాధారణ ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదన్నారు. మాట్లాడటానికి అవకాశం కల్పించాలని పలు మార్లు స్పీకర్​ను కోరినా.. ప్రయోజనం లేదని ఆయన మండిపడ్డారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, సీతక్క, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ రూ.27 లక్షలు వసూలు

ABOUT THE AUTHOR

...view details