కరోనా విషయంలో ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ శ్రేణులు గళమెత్తాయి. కరోనాను నివారించే చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు, కార్యకర్తలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన స్పీకప్ తెలంగాణ కార్యక్రమంలో పలువులు హస్తం నేతలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు.
'స్పీకప్ తెలంగాణ'లో ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నల పరంపర - congress leaders questioning telangana government in speakup program
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన స్పీకప్ తెలంగాణ కార్యక్రమంలో పలువులు హస్తం నేతలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉన్నందున అనేక మంది చనిపోయారని.. సెల్ఫీలు తీసి మరీ వారి ఇబ్బందులు వెల్లబుచ్చుకున్నా ప్రభుత్వం స్పందించలేదని నేతలు దుయ్యబట్టారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని.. ప్రైవేటు ఆసుపత్రుల్లో విపరీతంగా బిల్లులు వేస్తూ రోగులను పీడిస్తున్నారని ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయిందని విమర్శించారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉన్నందున అనేక మంది చనిపోయారని.. సెల్ఫీలు తీసి మరీ వారి ఇబ్బందులు వెల్లబుచ్చుకున్నా ప్రభుత్వం స్పందించలేదని నేతలు దుయ్యబట్టారు.
ఇటీవల కురిసిన వర్షానికి ఉస్మానియా ఆసుపత్రి చెరువులా మారిపోయినా, వార్డుల్లోకి మురుగు నీరు చేరినా ప్రభుత్వ అధికారులకు పట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిస్థితులు.. రాష్ట్ర పనితీరుకు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం ముందుండి పనిచేస్తున్న ఫ్రంట్లైన్ ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే.. రూ. 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.