జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్‌పేట కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తామని చెప్పి మోసం చేశారంటూ కాంగ్రెస్ నాయకులు సిటీలైట్ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా.. తమను గుర్తించకుండా ఇతరులకు టికెట్ కేటాయించడం పట్ల స్థానిక కాంగ్రెస్ నేత మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సేవా కార్యక్రమాలు చేస్తున్నా.. టికెట్ కేటాయించలేదని అసమ్మతి - elections in hyderabad
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్‌పేట కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించకపోవడంపై ఆశావాది మనోజ్ నిరసన వ్యక్తం చేశారు.
సేవా కార్యక్రమాలు చేస్తున్నా.. టికెట్ కేటాయించలేదని అసమ్మతి
హస్తం పార్టీ కేవలం డబ్బులకు టికెట్లను అమ్ముకుంటోందని మనోజ్ ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నా.. కాంగ్రెస్ గెలవలేదని ఆయన దుయ్యబట్టారు. డివిజన్ పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నా.. తమను గుర్తించకపోవడం సరికాదన్నారు.
ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రత్యేక కంట్రోల్ రూమ్