తెలంగాణ

telangana

ETV Bharat / state

'వట్టెం ముంపు బాధితులకు న్యాయం చేయండి'

వట్టెం జలాశయ భూ నిర్వాసితులకు సత్వర న్యాయం చేయాలని కాంగ్రెస్​ నేతలు నాగం జనార్దన్​రెడ్డి, మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. భూములు కోల్పోయే వారిని పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమని విమర్శించారు. తగిన పరిహారం చెల్లించకుంటే తమ పోరాటం ఉద్ధృతం చేస్తామని అన్నారు.

కాంగ్రెస్​ నేతలు

By

Published : Jun 18, 2019, 4:28 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ వట్టెం జలాశయ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారని కాంగ్రెస్​ నేత నాగం జనార్దన్​ రెడ్డి ఆరోపించారు. గతంలో ముంపు బాధితులకు న్యాయం చేయకుంటే తల నరుక్కుంటానన్న కేసీఆర్​ ఇప్పుడు వారిపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని గాంధీభవన్​లో విమర్శించారు. గిరిజనులు తమ సమస్యలు చెప్పుకుందామని ప్రగతిభవన్​కు వస్తే వారిని అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమని అన్నారు. వెంటనే ముంపునకు గురయ్యే ప్రాంతాల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

పోలీసు రాజ్యం నడుస్తోంది

ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మాజీ ఎంపీ మల్లు రవి విమర్శించారు. మల్లన్న సాగర్​ విషయంలో ఏ రకంగా రైతులకు పరిహారం ఇచ్చారో వట్టెం ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి అదే పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే తాము పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ముంపు బాధిత ప్రజలకు న్యాయం చేయాలన్న కాంగ్రెస్​ నేతలు

ఇదీ చూడండి : రేవంత్ రెడ్డి కాస్త వెరైటీ..!

ABOUT THE AUTHOR

...view details