తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్​ నేతలు - former union minister jaipalreddy death annevercery

కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ జైపాల్‌ రెడ్డికి శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నివాళులు అర్పించారు. జైపాల్​రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా నెక్లస్‌ రోడ్డులోని జైపాల్‌ రెడ్డి ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్​ నేతలు
కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్​ నేతలు

By

Published : Jul 28, 2020, 5:43 PM IST

కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్​ నేతలు నివాళులు అర్పించారు. హైదరాబాద్​ నెక్లెస్​రోడ్డులోని జైపాల్​ రెడ్డి ఘాట్​లోని ఆయన సమాధి వద్ద శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి... పుష్పగుచ్ఛాలు ఉంచారు.

జైపాల్​ రెడ్డి వర్ధంతితో పాటు... మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి జయంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ప్రధాన కార్యదర్శి నిరంజన్‌, ప్రేమలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!

ABOUT THE AUTHOR

...view details