ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వీహెచ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు - congress leaders
ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ సీనియర్ నేతలు నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
ప్రధానిగా ఇందిరాగాంధీ దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారంటూ ఆనాటి సందర్భాలను గుర్తు చేసుకున్నారు. గాంధీభవన్‌లోని ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
ఇవీ చూడండి: భాగ్యనగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యం..!