తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ - latest news on Congress leaders paid tribute to Ambedkar

కరోనాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Congress leaders paid tribute to Ambedkar
అంబేడ్కర్‌కు నివాళులర్పించిన కాంగ్రెస్‌ నేతలు

By

Published : Apr 14, 2020, 3:52 PM IST

Updated : Apr 14, 2020, 4:14 PM IST

కరోనాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కరోనాను పారదోలేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో జరిగిన డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హెచ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు సోహెల్, ప్రధాన కార్యదర్శులు ప్రేమ్ లాల్, బొల్లు కిషన్, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన కాంగ్రెస్‌ నేతలు
Last Updated : Apr 14, 2020, 4:14 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details