ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ లేఖ రాశారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి మాత ఊరేగింపును నిర్వహించాలని కోరారు. పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో ఊరేగింపు నిర్వహించాలని... ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే అవకాశం కల్పించాలన్నారు.
'పూరీ జగన్నాథ యాత్ర తరహాలో ఉజ్జయినీ అమ్మవారి యాత్ర చేయండి' - ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల యాత్ర వార్తలు
పూరీ జగన్నాథ రథయాత్ర స్ఫూర్తితో ఏనుగు అంబారీపై ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల యాత్ర జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ లేఖ రాశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే అవకాశం కల్పించాలని కోరారు.
'పూరీ జగన్నాథ యాత్ర తరహాలో ఉజ్జయినీ అమ్మవారి యాత్ర చేయండి'
ప్రజలకు అనుమతి లేకుండా... సంప్రదాయబద్ధంగా నిర్వహించి ఆనవాయితీని కొనసాగించాలని సూచించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని, వైరస్ను జయిస్తామనే ఆత్మ విశ్వాసం ప్రజల్లో పెంపొందుతుంది అన్నారు.
ఇవీ చూడండి:టికెటింగ్ కంపెనీల ఆదాయం ఫట్.. వేతనాల్లో భారీ కోతలు