నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు... జీవో 111 ఉల్లంఘనపై సమగ్ర దర్యాప్తు జరగాలంటే కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కేటీఆర్... నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
కేటీఆర్... మంత్రి పదవికి రాజీనామా చేయాలి: కాంగ్రెస్
అక్రమాలకు పాల్పడే మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేటీఆర్.. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని పట్టుబట్టింది.
కేటీఆర్... మంత్రి పదవికి రాజీనామా చేయాలి: కాంగ్రెస్
సీఎం కేసీఆర్ కళ్లు తెరిచి... అక్రమాలకు పాల్పడే మంత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. జడ్జిమెంట్ వచ్చి 24 గంటలవుతున్నా... మంత్రి, తెరాస పెద్దలు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా