inter practicals exams: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు, పరీక్ష తేదీల మార్పుపై కాంగ్రెస్ నేతలు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్‌ను కలిశారు. డిపార్ట్‌మెంట్ అధికారం లేకుండానే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలపై బోర్డు తీసుకున్న నిర్ణయాలన్ని వెనుక్కు తీసుకోవాలని ఆయనకు వినతిపత్రం అందించారు.
బోర్డు నిర్ణయం వల్ల ఇంటర్ ప్రాక్టికల్స్ విషయంలో ప్రేవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలోనే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోట్ల శ్రీనివాస్ హెచ్చరించారు.