Congress leaders met ERC: విద్యుత్ ఛార్జీలను పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని.. పాత ఛార్జీలనే అమలు చేయాలని ఈఆర్సీని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కోరారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ శ్రీరంగారావును.. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి హర్కర్ వేణుగోపాల్, వివిధ అనుబంధ సంఘాల ఛైర్మన్లు కలిశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈఆర్సీ ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు - congress leaders met erc chairman
Congress leaders met ERC: విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలపై భారం పెంచొద్దని.. పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ధర్నాలు చేపట్టారు. ఈ క్రమంలో ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ శ్రీరంగారావును.. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కలిశారు. విద్యుత్ ఛార్జీలను పెంచొద్దని వినతిపత్రం అందజేశారు.
![ఈఆర్సీ ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు electricity charges hike in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14861697-thumbnail-3x2-cr.jpg)
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు
ప్రభుత్వం బకాయి పడ్డ రూ.13వేల కోట్లు తక్షణమే వసూలు చేయడంతో పాటు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఛార్జీల పెంపుపై చర్చించాలని కాంగ్రెస్ ప్రతినిధులు కోరారు. విద్యుత్తు సంస్థలకు చెందిన పూర్తి ఆధారాలతో కూడిన శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:రేవంత్‌కు ఫ్రీహ్యాండ్... అసంతృప్తులకు హైకమాండ్ షాక్!