తెలంగాణ

telangana

ETV Bharat / state

'మున్సిపల్ పోరుకు కాంగ్రెస్ సన్నద్ధం' - congress leaders meeting on municipal election at Gandhi bawan Hyderabad

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గాంధీభవన్‌లో మున్సిపల్ ఎన్నికల కమిటీ సభ్యులు పొన్నం ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి, సంపత్‌కుమార్‌ సమావేశమయ్యారు.

congress leaders meeting on municipal election
'మున్సిపల్​ పోరుకు కాంగ్రెస్​ పార్టీ సిద్ధం'

By

Published : Dec 24, 2019, 6:12 PM IST

మున్సిపల్​ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్​ పార్టీ నేతలు గాంధీభవన్​లో సమావేశం నిర్వహించారు. మున్సిపల్​ పోరుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం స్థానిక నాయకత్వమే చూసుకుంటుందని...సెలెక్ట్‌ అండ్ ఎలెక్ట్‌ విధానం ద్వారా పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పొన్నం తెలిపారు. త్వరలోనే ఎన్నికల కమిటీ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.

హైకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఉల్లంఘించిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆరోపించారు. వార్డుల విభజన, రిజర్వేషన్లు పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని కోర్టు చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. ఓటమి భయంతో తెరాస పార్టీ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడిచేసి నోటిఫికేషన్ ఇప్పిచిందన్నారు. నోటిఫికేషన్ కంటే ముందే..తెరాస అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని కేటీఆర్ ఎలా ప్రకటిస్తారని సంపత్‌ ప్రశ్నించారు. రిజర్వేషన్లు తెలియకుండా అభ్యర్థులను ఎలా నిర్ణయిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

'మున్సిపల్​ పోరుకు కాంగ్రెస్​ పార్టీ సిద్ధం'

ఇదీ చూడండి: ఉత్తమ్​ ఎన్నికలకు ముందే కత్తి కిందపారేశారు: కర్నె

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details