తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Meet: మే మొదటి వారంలో రాహుల్​గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన - టీపీసీసీ రేవంత్ రెడ్డి

Congress Meet: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్న సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జీ మానిక్కం ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్​ పర్యటనతో పాటు పార్టీ సభ్యత్వం, బీమాపైనా చర్చించారు.

మే మొదటి వారంలో రాహుల్​గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన
మే మొదటి వారంలో రాహుల్​గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన

By

Published : Apr 15, 2022, 8:11 PM IST

Updated : Apr 16, 2022, 1:24 AM IST

Congress Meet: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన మే మొదటి వారంలో ఉంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో రెండు గంటలకుపైగా జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ సభ్యత్వం, బీమా, రాహుల్‌ గాంధీ పర్యటనపై చర్చించినట్లు ఆయన తెలిపారు. నేడు ఉదయం సీనియర్‌ నేతలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్కం ఠాగూర్‌ సమావేశమవుతారని వివరించారు.

రాష్ట్రంలో శుక్రవారంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందని.. ఇప్పటి వరకు 40 లక్షల సభ్యత్వం పూర్తయిందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. సభ్యత్వాలు తీసుకున్న వారందరికీ బీమా సౌకర్యం కల్పించామని అన్నారు. ఇందుకోసం గాంధీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి ప్రత్యేకించి పవన్‌ మల్లారెడ్డిని నియమించినట్లు ఆయన తెలిపారు.

రెండు రోజుల పర్యటన..

రాహుల్‌ గాంధీ రెండు రోజులు రాష్ట్రంలో పర్యటిస్తారని.. ఒక రోజు వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని.. రెండో రోజు పార్టీ నాయకులతో సమావేశం అవుతారని వివరించారు. వచ్చే నెల మొదటి వారంలో ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని.. ఆ విషయమై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వివరించారు.

ఇవీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు.. రైతులకు ప్రజాప్రతినిధుల సూచనలు

కరెంట్ 125 యూనిట్లు ఫ్రీ.. బస్ టికెట్లపై 50% డిస్కౌంట్.. సీఎం బంపర్ ఆఫర్!

Last Updated : Apr 16, 2022, 1:24 AM IST

ABOUT THE AUTHOR

...view details