congress leaders meet on munugodu by election ఉప ఎన్నికలో టికెట్ ఎవరికిచ్చినా సమిష్టిగా పనిచేయాలని రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. వీరితో భేటీ అనంతరం హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కమ్ ఠాగూర్‌లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు. ఏఐసీసీకి అభ్యర్థుల బలాలు, బలహీనతలపై సాయంత్రం పీసీసీ నివేదిక పంపనుంది. ఏఐసీసీ ఆమోదించిన వారినే మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా పీసీసీ ప్రకటించనుంది..
మునుగోడు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తును మరింత వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సమావేశమయ్యారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న నేతలతో వేర్వేరుగా భేటీ నిర్వహించి వారి వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకున్నారు. బలాలు, ప్రత్యర్థి పక్షాలను ఎలా ఎదుర్కొంటారనే అంశంపై వివరాలు సేకరించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా సమష్టిగా పని చేయాలని సూచించారు.
మునుగోడు ఆశావహులైన పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవికుమార్‌తో గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాజకీయ వ్యుహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే ఆశావాహుల బలాబలాలపై పీసీసీకి నివేదిక సమర్పించారు. ఆశావాహులతో సమావేశమైన తర్వాత రెండు మూడు రోజులలో అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజాదరణ, పార్టీ విధేయత, ప్రత్యర్థులకు గట్టీ పోటీ ఇవ్వగలిగే అభ్యర్థినే ఎంపిక చేయనున్నారు. నేటి సమావేశంలో రేవంత్ రెడ్డితోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.