రాష్ట్రంలో వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను కాపాడాలంటూ.. కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉన్నత విద్య మెరుగుపడుతుందని ఆశిస్తే... ప్రభుత్వం మాత్రం వర్సిటీలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందన్నారు.
"విశ్వవిద్యాలయాలను ఆక్రమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా.. పరోక్షంగా సంకేతాలు ఇస్తుంది. వర్సిటీలను కావాలనే నిర్వీర్యం చేస్తూ ప్రవేటుపరం చేస్తుంది. అందులోనే భాగంగా ఓయూ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోవట్లేదు."