తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరు.. సీఎస్​ను కలిసి వినతి పత్రం - Congress leaders met CS

Congress leaders meet CS Somesh Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎస్‌ సోమేశ్ కుమార్‌ను కలిశారు. ఆయనతో భేటీ అయి ఆరు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ధాన్యం కొనుగోలుతో పాటు పోడు భూములు, రుణ మాఫీ, పంట నష్టం.. వంటి ఆరు అంశాలపై సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

కాంగ్రెస్​ నేతలు
కాంగ్రెస్​ నేతలు

By

Published : Nov 21, 2022, 1:32 PM IST

సీఎస్‌ సోమేశ్ కుమార్‌ను కలిసి వినతి పత్రాలు అందజేసిన.. కాంగ్రెస్​ నేతలు

Congress leaders meet CS Somesh Kumar: రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం పోరుబాట పట్టింది. డిసెంబర్‌ 5 వరకు విడతల వారీగా ఆందోళనలకు సిద్ధమైన ఆ పార్టీ నేతలు ధాన్యం సమస్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిశారు. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, అజారుద్దీన్, కోదండరెడ్డి, బలరాంనాయక్​లు సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు.

అక్కడి నుంచి బీఆర్​కే భవన్‌కు వెళ్లిన పీసీసీ బృందం.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసి వినతీపత్రం ఇచ్చింది. పంట చేతికొచ్చి ధాన్యం కళ్లాల్లో ఉన్నా.. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరవక.. పలుచోట్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైస్ మిల్లర్ల దోపిడికి గురవుతున్నారని కాంగ్రెస్ నేతలు వాపోయారు. ధాన్యం కొనుగోలుతో పాటు పోడు భూములు, రుణమాఫీ, పంటనష్టం.. ఇలా ఆరు అంశాలపై సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details