Congress Leaders Fires on BRS : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఎలాగైనా మరోసారి అధికారం చేజిక్కించువాలని బీఆర్ఎస్.. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పోటీపడుతుంది. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, విజయశాంతి పాల్గొన్నారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
Uttam Kumar Reddy Comments on KCR : ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (MP Uttam Kumar Reddy)ఆరోపించారు. రైతు బంధు ఆపాలని తాను ఎక్కడా చెప్పలేదని చెప్పారు. తమ మేనిఫెస్టో చదివితే.. తాము ఏం చేయబోతున్నామో తెలుస్తుందని అన్నారు. రుణ మాఫీ ఏకధాటిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అన్నదాతలను ఓట్లు అడిగే అర్హత కేసీఆర్‌కు (CM KCR) లేదని పేర్కొన్నారు. కర్షకులకు.. క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే - ఆయన మనవడిని కూడా మంత్రిని చేస్తాడు : రేవంత్ రెడ్డి
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్ ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. కానీ హస్తం పార్టీ ఇచ్చి చూపిస్తుందని చెప్పారు. మేడిగడ్డ కుంగిపోయినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సిగ్గు పడాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.