పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేయకుండా కేసీఆర్ సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. స్థానిక సంస్థల నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
బయటికి రండి... నిధులపై కలిసి పోరాడుదాం : పొన్నం - సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
స్థానిక సంస్థల నిధులను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహా దీక్షకు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్లే తప్ప ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి అవసరంలేదని విమర్శించారు.
![బయటికి రండి... నిధులపై కలిసి పోరాడుదాం : పొన్నం congress leaders fire on govt to not release panchayat raj funds funds in the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9966221-399-9966221-1608629958386.jpg)
ప్రజా సంక్షేమం కంటే కమిషన్లే సీఎంకు ముఖ్యమని గీతారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తూ కేసులు పెట్టి నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పరిపుష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉండి నిధులు లేకుండా సర్పంచులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. నిధుల కోసం పోరాడేందుకు కాంగ్రెస్‌తో కలిసి రావాలని... పోరాడి హక్కులను సాధించుకుందామని పొన్నం పిలుపునిచ్చారు.