'మంత్రి కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారు...' మంత్రి కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తూ... యువతను మోసం చేస్తున్నారని పీసీసీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ఔషధనగరి అవసరమా లేదా అన్న చర్చ జరగాలన్న కోదండరెడ్డి... రైతుల నోట్లో మట్టి కొట్టి పారిశ్రామిక వేత్తలకు భూములు కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. యూపీఏ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు కాలేదని కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఐటీఐఆర్‌ను పూర్తి చేస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి ఎందుకు కల్పించట్లేదని ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలంటే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని నేతలు కోరారు.