చెరువును శుద్ధిచేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో పటేల్ కుంట చెరువును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ బాధ్యుడు రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. ఐదేళ్లుగా చెరువులో వ్యర్థాలు తొలగించడం లేదన్నారు.
చెరువును శుద్ధిచేయాలంటూ కాంగ్రెస్ నిరసన - చెరువును శుద్ధిచేయాలంటూ కాంగ్రెస్ నిరసన
నగరంలోని ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో నాచారం డివిజన్ పటేల్ కుంట చెరువును శుద్ధిచేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఐదేళ్లుగా చెరువును నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చెరువు వద్ద ధర్నా చేపట్టారు.
![చెరువును శుద్ధిచేయాలంటూ కాంగ్రెస్ నిరసన Congress leaders dharna in uppal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9138122-749-9138122-1602422379517.jpg)
చెరువును శుద్ధిచేయాలంటూ కాంగ్రెస్ నిరసన
దీనివల్ల దోమల బెడద పెరిగి కాలనీవాసులు డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజల ఇళ్లలోకి మురుగు నీరు వస్తోందని, ప్రభుత్వం చెరువును శద్ధిచేసేవరకు ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.