తెలంగాణ

telangana

ETV Bharat / state

'అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వమే ఆదుకోవాలి' - Government compensation for crop losses

Congress leaders met minister Niranjan Reddy: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కాంగ్రెస్​ నేతలు డిమాండ్​ చేశారు. వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో గ్రామాల వారిగా అంచనా వేసి తగు పరిహారం అందజేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

Congress leaders meet to Niranjan Reddy
Congress leaders meet to Niranjan Reddy

By

Published : Mar 19, 2023, 12:38 PM IST

Congress leaders met minister Niranjan Reddy: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం కలిశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు పరిహారం చెల్లించాలంటూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. తాజాగా కురుస్తున్న అకాల వర్షాలు, ఊదురు గాలులుతో కూడిన వడగళ్ల వానల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పంటల వివరాలు క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

మునుపెన్నడూ లేనిరీతిలో పడిన వడగళ్ల వర్షాలకు ప్రధాన ఆహార పంట వరితో పాటుగా పత్తి, మిరప, మామిడి తోటలు, కూరగాయలు, పూల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాంగ్రెస్​ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరి పంటకు ఎకరాకు రూ.12 వేలు, కూరగాయలు, ఆకుకూరల పంటలకు రూ.35 వేలు, మొక్కజొన్న పంటకు రూ.15 వేలు, మామిడి తోటలకు రూ.50 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ, డెయిరీ ఫారాలకు బ్యాంకులు వడ్డీ మాఫీ చేయాలని కోరారు. రాయితీపై దాణా సరఫరా చేసి.. షెడ్ల పునర్నిర్మాణానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు.

Heavy rains in Telangana: పూర్తిగా నష్టపోయిన సిమెంట్​ రేకులతో కట్టిన ఇళ్లకు ఇంటికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం లేదా రెండు పడకల గదుల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్​ చేశారు. తక్షణమే ప్రభుత్వ బృందాలను పల్లెలకు పంపించి నష్టపోయిన పంటలను అంచనా వేసి రైతాంగాన్ని అదుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన కాంగ్రెస్​ బృందంలో ఆ పార్టీ సీనియర్​ నేతలు వి.హన్మంత రావు, కోదండరెడ్డి, వీహెచ్‌, జగ్గారెడ్డి, ప్రసాద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

మామిడి తోటలను పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్​:ఆకాల వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లోని తొర్రూరు, పెద్దవంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నష్టాన్ని మంత్రి పరిశీలించారు. మామిడి తోటలకు వెళ్లిన ఆయన.. రైతులతో మాట్లాడి జరిగిన నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాలిన మామిడికాయలను పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎర్రబెల్లి భరోసా కల్పించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details