తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్‌ దాడిలో గాయపడ్డ శరణప్పను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు - శరణప్ప కుటుంబ సభ్యులను కాంగ్రెస్​ నాయకులు ఓదార్చారు.

తెరాస నేత పెట్రోల్‌ దాడిలో గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరణప్పను కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్​లు పరామర్శించారు. అతనిపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.

Congress leaders criticizing refugee injured in patrol attack at Hyderabad
పెట్రోల్‌ దాడిలో గాయపడ్డ శరణప్పను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

By

Published : Dec 9, 2019, 1:28 AM IST

తెరాస నేత పెట్రోల్‌ పెట్రోల్ దాడి ఘటనలో గాయపడిన శరణప్పను గాంధీ ఆస్పత్రిలో కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్​లు పరామర్శించారు. శుక్రవారం రాత్రి జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శరణప్ప కుటుంబ సభ్యులను కాంగ్రెస్​ నాయకులు ఓదార్చారు. అతని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శరణప్పపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని అన్నారు.

తెలంగాణ పోలీసులు తెరాస కార్యకర్తలుగా మారారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఈ ఘటన ఎంతో బాధాకరమని అన్నారు. అతనిపై పెట్రోల్​తో దాడి చేయడం, అక్కడ ఉన్న మహిళలపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడడం సరికాదన్నారు. పేదవారు నగరంలో బతకలేని దారుణ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

బోయినపల్లిలో ఓ స్థల వివాదంలో తనపై ముగ్గురు వ్యక్తులు వచ్చి పెట్రోల్​తో దాడికి పాల్పడ్డారని బాధితుడు శరణప్ప తెలిపాడు. తాను ప్రకాష్ రెడ్డి వద్ద వాచ్​మెన్​గా పని చేస్తున్నానన్నారు. మాధవరెడ్డి అతని అనుచరులు వచ్చి అర్ధరాత్రి సమయంలో వచ్చి మహిళపై దాడి చేసి, తనపై పెట్రోల్ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి : అధికార పార్టీ ఆగడాలు అరికట్టాలి : సీఎల్పీ నేత భట్టి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details