తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ్‌ను పరామర్శించిన కాంగ్రెస్​ నేతలు - Uttam Kumar Reddy suffering from knee pain

మోకాలు నొప్పితో ఇబ్బందిపడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని శుక్రవారం పలువురు కాంగ్రెస్‌ నాయకులు పరామర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులపై చర్చించారు.

Congress leaders consulted the pcc chief uttam kumar reddy
ఉత్తమ్‌ను పరామర్శించిన కాంగ్రెస్​ నేతలు

By

Published : Aug 7, 2020, 11:09 PM IST

మోకాలు నొప్పితో బాధపడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని శుక్రవారం పలువురు కాంగ్రెస్‌ నేతలు పరామర్శించారు. కొన్ని రోజులుగా మోకాలు నొప్పితో ఇంటి వద్దనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి కె.జానారెడ్డి పరామర్శించారు.

శుక్రవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, దీపక్​జైన్‌, కట్ల శ్రీనివాస్‌, తదితరులు పరామర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ్‌ నివాసంలోనే కేక్‌ కట్​చేసి సంబురాలు జరుపుకున్నారు.

ఉత్తమ్‌ను పరామర్శించిన కాంగ్రెస్​ నేతలు

ఇదీ చూడండి :కేరళ విమాన ప్రమాదంలో ఐదుకు చేరిన మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details