Congress leaders complaint to the police: కాంగ్రెస్ పార్టీపైన, నాయకులపైన దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతం, కొంపల్లి 5వ వార్డు కౌన్సిలర్ శ్రీవిద్య ప్రశాంత్గౌడ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డిపై ఆసత్య వార్తల ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు - తెలంగాణ రాజకీయ వార్తలు
Congress leaders complaint to the police: సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ సామాజిక పార్టీ పెడుతున్నట్లు జర్నలిస్టు శంకర్ పేరు మీద ట్విటర్ ద్వారా ట్వీట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది.
జర్నలిస్ట్ శంకర్ పేరు మీద.. రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్లు ట్విటర్‌లో ట్వీట్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ సైబర్ క్రైం పోలీసులకు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్‌రెడ్డి బేగంబజార్ పోలీసులకు, ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతం మేడిపల్లి పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీపైన, నాయకులపైన దుష్ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపైన, పార్టీపైన ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.