తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.100 కోట్లు కట్టి కేటీఆర్‌ను ఏమైనా అనొచ్చా?: రేవంత్‌రెడ్డి - Revanth Reddy fires on KCR

Revanth Reddy on TSPSC Paper Leak Case: పరువు నష్టం కేసులో కేటీఆర్‌ తనను బెదిరించలేరని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన పరువు రూ.100 కోట్లు అని ఎలా నిర్ణయించారని అన్నారు. రూ.100 కోట్లు కట్టి కేటీఆర్‌ను ఏమైనా అనొచ్చా అని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Mar 31, 2023, 4:18 PM IST

రూ.100 కోట్లు కట్టి కేటీఆర్‌ను ఏమైనా అనొచ్చా?: రేవంత్‌రెడ్డి

Revanth Reddy on TSPSC Paper Leak Case: టీఎస్​పీఎస్సీ లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కి ఫిర్యాదు చేశారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్‌ను కలిసి.. విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు ఎలా వచ్చాయనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు.

కేటీఆర్‌ నన్ను బెదిరించలేరు: పరువు నష్టం కేసులో కేటీఆర్‌ తనను బెదిరించలేరని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఆయన పరువు రూ.100 కోట్లు అని ఎలా నిర్ణయించారని అన్నారు. రూ.100 కోట్లు కట్టి కేటీఆర్‌ను ఏమైనా అనొచ్చా అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేసే వారు పవిత్రంగా ఉండాలని.. కానీ కమిషన్ దోపీడీదారులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్​రెడ్డి విమర్శించారు.

పెద్దలను కాపాడి చిరు ఉద్యోగులను బలిచేస్తున్నారు: ప్రశ్నించిన విద్యార్థి సంఘం నేతలపై కేసులు పెట్టడం సిగ్గుచేటని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. పేపర్ లీకేజ్‌లో అధికారిణి శంకరలక్ష్మి నుంచే నేరం మొదలైందని తెలిపారు. శంకరలక్ష్మిని ఏ-1, ఛైర్మన్‌ను ఏ-2, సెక్రెటరీని ఏ-3గా చేర్చాలని అన్నారు. పెద్దలను కాపాడి చిరు ఉద్యోగులను బలిచేస్తున్నారని ఆరోపించారు. 420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్‌ సహా టీఎస్‌పీఎస్సీ అధికారులందరిని ప్రశ్నించాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు.

సమయం అయిపోయినా చాలా మంది పరీక్షలు రాశారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. సిట్‌ అధికారులు కోర్టుకు మాత్రమే సమాచారం ఇస్తామన్నారని.. కానీ కేటీఆర్‌కు సిట్‌ వద్ద ఉన్న సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అభ్యర్థుల కటాఫ్‌ మార్కులు ఆయనకు ఎలా తెలిశాయని పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ, ఈడీ అధికారులతో విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. పేపర్‌ లీకేజీలో విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

"ప్రశ్నించిన విద్యార్థి సంఘం నేతలపై కేసులు పెట్టడం సిగ్గుచేటు. పేపర్ లీకేజ్‌లో అధికారిణి శంకరలక్ష్మి నుంచే నేరం మొదలైంది. శంకరలక్ష్మిని ఏ-1, ఛైర్మన్‌ను ఏ-2, సెక్రెటరీని ఏ-3గా చేర్చాలి. పెద్దలను కాపాడి చిరు ఉద్యోగులను బలిచేస్తున్నారు. కేటీఆర్‌ సహా టీఎస్‌పీఎస్సీ అధికారులందరిని ప్రశ్నించాలి. పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్‌కు ఇచ్చింది ఎవరు. సీబీఐ, ఈడీ అధికారులతో విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. 420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయి." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:TSPSC పేపర్ లీకేజీలో మరో ట్విస్ట్.. నిందితుల పెన్​డ్రైవ్​లో 15 ప్రశ్నపత్రాలు

TSPSC కార్యాలయ ముట్టడికి యత్నం.. వైఎస్ షర్మిల అరెస్ట్

మృత్యు బావికి 35 మంది భక్తులు బలి.. 'ఇదేంటి రామా?'.. అంటూ కుటుంబీకుల తీవ్ర ఆవేదన!

ABOUT THE AUTHOR

...view details