జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఇతర నాయకులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు, గాంధీభవన్ ఇంఛార్జీ రమణరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ కార్యవర్గ సభ్యులు తదితరులు గాంధీభవన్‌లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబురాలు - వి.హనుమంతురావు తాజా ావర్తలు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధిక స్థానాలు గెలుచుకోవడంచతో గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు.
గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబురాలు