తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఘనంగా సంజీవయ్య జయంతి వేడుకలు' - Congress Leader V Hanmantharao

మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 99వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు ఆర్పించారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.

Sanjeevayya Jayanthi
'ఘనంగా సంజీవయ్య జయంతి వేడుకలు'

By

Published : Feb 14, 2020, 10:32 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని దామోదరం సంజీవయ్య విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కైలాస్‌, కార్యదర్శి శంబుల శ్రీకాంత్‌ గౌడ్‌, యువజన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఎస్‌.పి. క్రాంతికుమార్‌, దయాకర్‌ తోపాటు పలువురు పాల్గొన్నారు.

కుటుంబం కంటే దేశానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిగా సంజీవయ్య చేసిన సేవలను వీహెచ్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత రాజకీయనాయకులందరికీ ఆయన ఆదర్శమని చెప్పారు. సంజీవయ్య లాంటి నాయకుని జయంతి వేడుకలకు ప్రభుత్వం తరపున ఎవరూ రాకపోవడం విచారకరమన్నారు.

ఘనంగా సంజీవయ్య జయంతి వేడుకలు

ఇవీ చూడండి:మంత్రి గారి చేతి కడియం కొట్టేశారు!

ABOUT THE AUTHOR

...view details