తెలంగాణ

telangana

ETV Bharat / state

వీరజవాన్లకు నివాళి - వీరజవాన్లకు కాంగ్రెస్ నేతల నివాళి

పుల్వామా ఉగ్రదాడిని రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. చార్మినార్ వద్ద వీరజవాన్లకు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

వీరజవాన్లకు కాంగ్రెస్ నేతల నివాళి

By

Published : Feb 22, 2019, 6:21 AM IST

Updated : Feb 22, 2019, 9:37 AM IST

హైదరాబాద్​లోని చార్మినార్ వద్ద అమరులైన జవాన్లకు నివాళిగా కాంగ్రెస్ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వీహెచ్​లు హాజరయ్యారు.

కశ్మీర్​లో సీఆర్పీఎఫ్ జవాన్​లపై జరిగిన దాడికి ప్రతిఘటనగా.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చే సందేశానికి తాము కట్టుబడి ఉంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఉగ్రవాదం నిర్మూలించేందుకు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని సూచించారు. సైనికులపై జరిగిన దాడిని దేశంపై జరిగిన దాడిగా హస్తం నేతలు అభివర్ణించారు. పుల్వామా దాడి ఘటనను దృష్టిలో పెట్టుకొని క్రికెట్ వరల్డ్ కప్ పోటీ నుంచి పాకిస్థాన్ బృందాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

వీరజవాన్లకు కాంగ్రెస్ నేతల నివాళి

ఇవీ చదవండి:'కాంగ్రెస్ టాస్క్​ఫోర్స్​'

Last Updated : Feb 22, 2019, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details