విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం కేసీఆర్‌కు లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా... గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం, పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, వీహెచ్‌తో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు.
Uttam: రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు - రాష్ట్ర ఆవర్భావ వేడుకలు
తెలంగాణలో అవినీతి తారస్థాయికి చేరిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేట్లు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Uttam: రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు
తెలంగాణ ప్రజల ఆరున్నర దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కిందన్న ఉత్తమ్... ప్రజల ఆకాంక్షల మేరకు తెరాస పాలన సాగటంలేదన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా... హస్తం కార్యకర్తలు కృషి చేయాలని ఉత్తమ్ సూచించారు.
ఇదీ చూడండి:Formation Day: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు..