తెలంగాణలో 36 బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మాణం చేస్తామన్న మాటను ప్రభుత్వం ఆచరణలో చూపడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఇప్పటి వరకు కొన్ని బీసీ కులాలకు కేటాయించిన స్థలాలకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయమై ఉప్పల్, మేడిపల్లి ఎమ్మార్వోలను కలిసి చర్చించినట్లు ఆయన తెలిపారు.
బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలు ఏమయ్యాయి: వీహెచ్ - ఆత్మ గౌరవ భవనాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వీహెచ్
రాష్ట్రంలోని బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తామన్న మాటను ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఈ విషయంపై బీసీ కులాల నాయకులు, సంఘాల ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రితో చర్చిస్తానని తెలిపారు.
బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలు ఏమయ్యాయి: వీహెచ్
వివిధ సంఘాలకు భూమిని కేటాయిస్తూ బీసీ శాఖకు అందజేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపినట్లు హనుమంతరావు వివరించారు. ప్రభుత్వం 36 బీసీ కులాలకు 67 ఎకరాల స్థలాన్ని, రూ.60 కోట్ల నిధులను కేటాయిస్తూ 2018లో జీవో జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. ఈ విషయంపై బీసీ కులాల నాయకులు, సంఘాల ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రితో చర్చిస్తానని తెలిపారు.
ప్రభుత్వం పగ సాధిస్తోంది : మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్