తెలంగాణ

telangana

రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: వీహెచ్​

By

Published : Jan 29, 2021, 3:28 PM IST

కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకే మోదీ ప్రభుత్వం సాగు చట్టాలను తీసుకొచ్చిందని కాంగ్రెస్​ సీనియర్ నేత వీహెచ్​ ఆక్షేపించారు. దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో కావాలనే అరాచక శక్తులను ప్రవేశపెట్టి.. అన్నదాతలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: వీహెచ్​
రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: వీహెచ్​

రైతుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కేంద్రం వారిపై కేసులు పెడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చాలనే మోదీ ప్రభుత్వం ఈ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. ట్రాక్టర్ ర్యాలీలో కావాలనే అరాచక శక్తులను ప్రవేశపెట్టి.. అన్నదాతలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సాగు చట్టాల రద్దు కోసం అన్నదాతలు రెండు నెలలుగా చేస్తున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కుట్ర పన్నారని వీహెచ్​ ఆరోపించారు. నరేంద్ర మోదీ చేసిన దురాగతంపై గ్రామ గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు చాటి చెప్పాలన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని.. కార్పొరేట్ ప్రభుత్వమని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసు అనిశా పరిధిలోకే వస్తుంది : కోర్టు

ABOUT THE AUTHOR

...view details