Congress leader V Hanumantrao: పంజాగుట్ట చౌరస్తాలో తిరిగి అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ విషయంపై అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు చర్చించాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కోరారు. ఇదే అంశంపై గన్‌పార్క్ వద్ద చేపట్టిన మౌనదీక్ష విరమణ అనంతరం విహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నాలుగేళ్ల క్రితం అక్కడ ఉన్న విగ్రహాన్ని గోషామహల్ పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లారు. ఈ విషయంపై అప్పటి నుంచి పోరాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు.