కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణ నష్టానికి దారి తీస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ బషీర్బాగ్లోని ఆయాకర్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: వీహెచ్ - విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: వీహెచ్
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ... బషీర్బాగ్లోని ఆయాకర్ భవన్ ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేసేవరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
![విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: వీహెచ్ congress leader v hanumantha rao demands postponement of entrance exams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8590976-122-8590976-1598610044851.jpg)
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: వీహెచ్
దేశంలో నెలకొన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
TAGGED:
v hanumantha rao latest news