తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మరోసారి మోసం చేశారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్ హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైరవీకారులకు అవకాశాలిస్తున్నారని ఆరోపించారు.
ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు: కాంగ్రెస్ నేత రాములు నాయక్ - కాంగ్రెస్ నేత రాములు నాయక్ కేసీఆర్‌పై విమర్శలు
కేసీఆర్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్ ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైరవీకారులకు అవకాశమిస్తున్నారంటూ ఆరోపించారు.

ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు: కాంగ్రెస్ నేత రాములు నాయక్
ప్రగతిభవన్‌లో పదవులు అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నారంటూ రాములునాయక్ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎస్టీలు తమ ప్రభావాన్ని చూపాలన్నారు. నాయిని కుటుంబాన్ని క్షోభకు గురిచేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు 6 నెలలు కూడా ఆగకుండా పదవి ఇచ్చారని.. శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రతిసారి అమెను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కాంగ్రెస్‌లో గ్రేటర్ ఎన్నికల సందడి... గెలుపు గుర్రాల కోసం వేట