కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. మొక్కజొన్న రైతులు మహా ధర్నాకు పిలుపునిస్తే వారిని ముందస్తు అరెస్టులు చేయడం ఎందుకని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులను పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
రైతులను అరెస్ట్ చేయడం దారుణం: పొన్నం ప్రభాకర్ - hyderabad latest news
మహా ధర్నాకు పిలుపునిచ్చిన మొక్కజొన్న రైతుల ముందస్తు అరెస్టులను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఖండించారు. అక్రమ అరెస్టులను పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
రైతులను అరెస్ట్ చేయడం దారుణం: పొన్నం ప్రభాకర్
మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం నాఫెడ్ ద్వారా మక్కలను కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల డిమాండ్ల సాధన కోసం మహా ర్యాలీ చేస్తే అడ్డుకుంటారా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి:కాస్త దిగొచ్చిన బంగారం, వెండి ధరలు