తెలంగాణ

telangana

ETV Bharat / state

'రిజర్వేషన్లపై భాజపా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది' - reservations

రిజర్వేషన్లపై భాజపా ముందు నుంచే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పొన్నం ప్రభాకర్ అన్నారు. రిజర్వేషన్లపై ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్​ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. భాజపా నుంచి గెలిచిన 4 ఎంపీలు స్పందించాలని డిమాండ్ చేశారు.

ponnam prabhakar

By

Published : Aug 20, 2019, 2:59 PM IST

రిజర్వేషన్లు సమీక్షించాలని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్​ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రిజర్వేషన్లపై భాజపా ముందు నుంచే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. మండల్​ కమిషన్​కు వ్యతిరేకంగా అడ్వాణీ దేశవ్యాప్తంగా యాత్ర చేశారని గుర్తుచేశారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తెలంగాణ భాజపా స్పందించాలని డిమాండ్ చేశారు.

'రిజర్వేషన్లపై భాజపా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details