రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న ప్రధాని మోదీ ఇప్పుడేమో వారి ఉసురు తీస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ కర్షకుల పట్ల మొండి వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు.
రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : పొన్నాల
రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంభిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఎన్నికల ముందు ఎమ్ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య
ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామన్న హామీని మర్చిపోయారా అని నిలదీశారు. చర్చల పేరుతో నాటాకాలాడుతున్నారని కేంద్రంపై పొన్నాల ధ్వజమెత్తారు. అవినీతి బయట పడుతుందనే భయంతో సీఎం కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు.