తెలంగాణ

telangana

ETV Bharat / state

కోనేరుపై కేసు నమోదు చేయాలని హైకోర్టులో పిటిషన్​ - ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

అటవీ అధికారి అనితపై దాడి కేసులో ఎమ్మెల్యే కోనేరు సాక్షులను బెదిరించారని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని కాంగ్రెస్​ నేత పాల్వాయి హరీష్​ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేలా ఆసిఫాబాద్​ ఎస్పీని ఆదేశించాలని హరీష్​ ధర్మాసనాన్ని కోరారు.

హైకోర్డు

By

Published : Aug 1, 2019, 11:36 AM IST

అటవీ అధికారిపై దాడి ఘటనలో సాక్షులను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బెదిరించినప్పటికీ... పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 30న అటవీ అధికారి అనితపై ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ దాడి చేశారని.. ఆ కేసులో సాక్షులను కోనప్ప బెదిరించారని హరీష్ పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలని జులై 10న కాగజ్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. కోనేరుపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేలా కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా ఎస్పీని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. స్పందించిన హైకోర్టు వారం రోజుల్లో వివరాలు తెలపాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details