ప్రధాన మంత్రి రిలీఫ్ ప్యాకేజి కింద అర్హులకు రావాల్సిన 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు రాష్ట్ర ప్రజలకు అందలేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కేంద్ర సాయంతో కలిపి 12కిలోలు బియ్యం ఇస్తామని ఈ నెల 19న సీఎం కేసీఆర్ చెప్పినా... ఇప్పటి వరకు కేంద్ర సాయం అందలేదన్నారు. తెలంగాణ సీఎం ప్రకటన నేపథ్యంలో పీఎం రిలీఫ్ ప్యాకేజీ అందే అవకాశాల్లేవని భావించవచ్చా... అని కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ ఓ లేఖను కిషన్‌రెడ్డికి మెయిల్ ద్వారా పంపినట్లు శశిధర్‌రెడ్డి వివరించారు.
తెలంగాణ ప్రజలకు అందని పీఎం రిలీఫ్ ప్యాకేజీ : మర్రి శశిధర్ రెడ్డి - పీఎం రిలీఫ్ ప్యాకేజీ మర్రి శశిధర్ రెడ్డి
కేంద్రం ప్రకటించిన పీఎం రిలీఫ్ ప్యాకేజి నుంచి తెలంగాణ ప్రజలకు ఎలాంటి సాయం అందలేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.
మర్రి శశిధర్ రెడ్డి