తెలంగాణ

telangana

'పోతిరెడ్డిపాడు పెంపుపై సీఎం స్పందించకపోవడం విచారకరం'

By

Published : May 11, 2020, 4:40 PM IST

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడకపోవడం విచారకకమరని కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్​ రెడ్డి విమర్శించారు. ఏపీ సీఎం జగన్​ మోహన్​ రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేలా అనుమతుల జీవో విడుదల చేసినా తెలంగాణ ప్రభుత్వ వైఖరీ మారడం లేదన్నారు. ఆ ప్రాజెక్ట్​ ద్వారా రాయలసీమకు నీళ్లను తరలించే కార్యక్రమం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.

'పోతిరెడ్డిపాడు పెంపుపై సీఎం స్పందించకపోవడం విచారకరం'
'పోతిరెడ్డిపాడు పెంపుపై సీఎం స్పందించకపోవడం విచారకరం'

రోజుకు 10 టీఎంసీ నీళ్లను తరలించే ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వం చేస్తోంది. వరదనీళ్లు రాయలసీమకు మళ్లించడంపై తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రోజే చెప్పాము. వికారాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తీవ్రమైన నీటి ఎద్దడి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడకపోవడానికి... జగన్-కేసీఆర్​ల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింది?. నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణలో రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టడంలో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెడతారని ఎప్పుడు ఊహించలేదు.

-మర్రి శశిధర్​ రెడ్డి, కాంగ్రెస్​ నేత

'పోతిరెడ్డిపాడు పెంపుపై సీఎం స్పందించకపోవడం విచారకరం'

ఇదీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ABOUT THE AUTHOR

...view details