తెరాస నేతలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్, తెదేపా నుంచి ఎమ్మెల్యేలను తెరాసలోకి తీసుకెళ్లి ఐదుగురుని బరిలో దించి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలవకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం ముఖ్యమైన విషయాలు మాట్లాడగానే ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం కల్పించాలని, ఈ విషయాన్ని గులాబీ అధిపతి మరిచి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
'ప్రశ్నించే వారు లేకుండా చేస్తున్నారు' - KTR
రాజకీయ లబ్ధి, తమను ప్రశ్నించకుండా ఉండడం కోసమే తెరాస నేతలు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుంటున్నారు: మల్లు రవి, కాంగ్రెస్ నేత
!['ప్రశ్నించే వారు లేకుండా చేస్తున్నారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2698801-918-96e506d1-c4d4-4098-a605-61f05c4383f9.jpg)
'ప్రశ్నించే వారు లేకుండా చేస్తున్నారు'