తెలంగాణ

telangana

ETV Bharat / state

VH: నన్ను పొమ్మనలేకే పొగపెడుతున్నారు: వీహెచ్​ - vh latest news

కాంగ్రెస్‌లో తనను పొమ్మనలేక పొగబెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నారని వి.హనుమంతురావు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విధేయులకు విలువ, ఆత్మగౌరవం ఉందా లేదా అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్​ను ప్రశ్నించారు. బయట వాళ్లను అందలం ఎక్కించే ముందు వారి ట్రాక్‌ రికార్డు కూడా పరిశీలించాలని సూచించారు.

v.hanumnatha rao: 'నన్ను పొమ్మనలేకే పొగపెడుతున్నారు'
congress leader hanumantharao fire on manikkam tagore

By

Published : Jun 13, 2021, 5:10 PM IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విధేయులకు విలువ, ఆత్మగౌరవం ఉందా లేదా అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్​ను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు (VH) ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీఠ వేస్తామంటే అది తమకు అవమానం కాదా అని నిలదీశారు. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా.. ఆయన అదృష్టం బాగుండి తిరిగి కొనసాగుతున్నారన్నారు.

కర్ణాటకలో కొత్త పీసీసీ కోసం పరిశీలకుడిని పంపించారని, పంజాబ్‌లో కూడా అదే జరుగుతోందని ఒక్క తెలంగాణలోనే మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేశారని వీహెచ్ విమర్శించారు. కాంగ్రెస్‌లో తనను పొమ్మనలేక పొగబెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానానికి లేఖలు రాస్తే తప్పుబడుతున్నారని.... 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా జరగలేదని ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్ష పదవిని విధేయులకు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం తప్పా అని ప్రశ్నించారు. బయట వాళ్లను అందలం ఎక్కించే ముందు వారి ట్రాక్‌ రికార్డు కూడా పరిశీలించాలని సూచించారు. రాష్ట్రానికి ఇంఛార్జీగా వచ్చి ఇప్పటి వరకు ఏమి చేశారో మానిక్కం ఠాగూర్‌ చెప్పాలని వీహెచ్ నిలదీశారు.

VH: 'నన్ను పొమ్మనలేకే పొగపెడుతున్నారు'

ఇదీ చూడండి: RAITHUBANDHU: ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

ABOUT THE AUTHOR

...view details